భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25 (మహా)
జి కె ఓసి మరియు వి కె కోల్ మైన్ ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు అందించడం సింగరేణి సంస్థ మేనేజ్‌మెంట్‌కు ఒక సామాజిక బాధ్యతా భావానికి ప్రతీక.
సింగరేణి సి ఎండి ఎన్. బాలరాం మార్గదర్శకత్వంలో కొత్తగూడెం ఏరియా జిఎం ఎం షాలెం రాజు అధ్వర్యంలో చేపట్టిన తేనెటీగల పెంపకం శిక్షణా కార్యక్రమం ఒక మైలురాయిగా నిలిచింది. “సిఎస్ ఆర్” కార్యక్రమం కింద మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, త్రిపుర సహకారంతో 100 మంది మహిళలు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకొని, మూడు రోజుల సమగ్ర శిక్షణను విజయవంతంగా పూర్తి చెసిన సందర్బంగా శుక్రవారం ఆర్.సి.ఓ.ఏ క్లబ్ రుద్రంపూర్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి జిఎం ముఖ్య అతిదిగా హజారయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ, తేనెటీగల పెంపకం – ప్రకృతి , పంటల రక్షకుడు మరియు తేనె అనేది ఆరోగ్యాన్ని కాపాడే సహజ ఆహార పదార్థం మాత్రమే కాకుండా ప్రతిరోజు మన ఆరోగ్య జీవన శైలికి ఎంతో తోడ్పడుతుందని తేనెటీగల పరాగసంపర్కం (పోలినేషన్) ద్వారా వ్యవసాయ పంటల దిగుబడి పెరుగుతుందని, రైతులకు అధిక ఆదాయం లభిస్తుంది, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో తేనెటీగల పాత్ర అనివార్యం, అందువల్ల ఈ వ్యవసాయ పద్ధతి ప్రకృతితో మమేకమయ్యే ఒక సుస్థిర మార్గం అన్నారు.
అలాగే ఈ శిక్షణ ద్వారా మహిళలు, తమ ఇళ్ల వద్దే తేనెటీగల పెంపకం చేసి అదనపు ఆదాయాన్ని పొంధి ఆర్థికంగా స్వావలంబన సాధించగలరని కుటుంబాలను అభివృద్ధి చేసి, సమాజానికి మార్గదర్శకులుగా నిలవగలరని, శిక్షణా కార్యక్రమం పూర్తైన తర్వాత, అన్ని లబ్ధిదారులకు ఉచితంగా తేనెటీగల పెంపక బాక్స్ మరియు అవసరమైన కిట్ (ఫేస్ ప్రొటెక్షన్ మాస్క్, గ్లోవ్స్, బీహాండ్లింగ్, ఎక్విప్మెంట్ బాక్స్) అందజేయబడుతుందని, అదనంగా ఏవైనా సందేహాలు లేదా సూచనల కోసం, మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ బృందం రెండు సంవత్సరాల పాటు నిరంతర మార్గదర్శకత్వం మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తుందని, లబ్ధిదారులకు సులభంగా సేవలు అందించడానికి మన ప్రాంతంలో వారి ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారని తేలియజేసారు.
అలాగే ఈ కార్యక్రమం మహిళలకు ఉపాధి మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం మరియు గౌరవప్రదమైన జీవన విధానాన్ని ఉపాధిని మాత్రమే కాకుండా, వారి జీవితాలను సుస్థిరత, గౌరవం మరియు ఆత్మవిశ్వాసంతో నింపుతుందని మాకు గట్టి నమ్మకం కూడా అందిస్తుంధన్నారు.
ఈ కార్యక్రమంలో జిఎం గారితో పాటు కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జె. గట్టయ్య, ఐఎన్ టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్, కొత్తగూడెం ఏరియా ఎస్వోటు జిఎం జి.వి. కోటి రెడ్డి, ఎజిఎం (ఎఫ్ ఎం) కె. హనా సుమలత, డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, డివై పిఎం జి. హరీష్, రాజ్వాలియా మాలిక్ మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ (ట్రైనర్) మరియు మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు.







