కారేపల్లి, మహా : సింగరేణి తహసీల్ధార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం సందర్శించారు. భూభారతి రెవిన్యూ సదస్సులు సందర్భంగా వచ్చిన దరఖాస్తుల ఆన్లైన్ పక్రియను ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేయాలన్నారు. దరఖాస్తులు సక్రమంగా లేకుంటే దానికి సంబంధించి దరఖాస్తుదారునికి నోటీస్ ఇచ్చి పూర్తి సమాచారాన్ని తీసుకున్న తర్వాత చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి దరఖాస్తుపై నియమనిబంధనలు అనుగుణంగానే చర్యలు ఉంటాయన్నారు. భూభారతిలో కాలంలకు అనుగుణంగా రెవిన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్ధార్ అనంతుల రమేష్, డీటీ కృష్ణయ్య, ఆర్ఐ సామినేని నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 34







