Mahaa Daily Exclusive

  ఎస్సార్ కళాశాల విద్యార్దిని అనుమానస్పద మృతి ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యం దర్యాప్తు చేపట్టిన హన్మకొండ పోలీసులు …!

Share

హన్మకొండ మహా;

హనుమకొండ నయింనగర్‌ లోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న ఓ ఉత్తమ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందడం జిల్లాలో కలకలం రేపింది. మంచిర్యాల జిల్లాకు చెందిన మిట్టపల్లి శివాని (16) ఎం.పి.సి మొదటి సంవత్సరం విద్యార్థినీ, కళాశాల లోనే ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రికి తరలించే క్రమంలో కళాశాల ప్రాంగణంలోనే మృతిచెందింది. అయితే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండానే కళాశాల యాజమాన్యం నేరుగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి మార్చురీకి తరలించింది. ఈ చర్య పై శివాని కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థుల లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కాగా ఘటనాస్థలంలో ఒక సూసైడ్ నోట్ కూడా లభించగా అందులో కళాశాలలో చేర్చే ముందు ఒక్కసారి ఆలోచించాల్సింది అంటూ శివాని తన మనోవేదనను వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ లేఖతో మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శివాని ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసేందుకు పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం నుంచి ఈ ఘటన పై ఇప్పటివరకు అధికారిక స్పందన రాకపోవడంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఈ ఘటన పై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి.

కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్

ఎస్సార్ కళాశాలలో చదువుతున్న శివాని మృతి చెందడం బాధాకరమని ఆమె చాలా ఉత్తమమైన విద్యార్థిని అని ఇంటర్ లో కోర్సు విషయంలో మొదటి నుండి మానసిక ఒత్తిడికి గురైనట్లు తన తల్లిదండ్రుల అభీష్టం మేరకు ఎంపీసీ జేఈఈ మెయిన్స్ లో చేరిన శివాని సిక్ హాలిడేస్ నుండి కళాశాలకు తిరిగి వచ్చిన అనంతరం ఆమె మానసిక ఒత్తిడిని తట్టుకోలేక క్షణికావేశంలో ఆదివారం సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ వెల్లడించారు. శివాని మృతి పై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ చరవాణి లో తెలిపారు.