Mahaa Daily Exclusive

  కాలేశ్వరం…శివోహం…శివోహం..!

Share

కాటారం, మహా : కాశి కంటే వరి ముళ్ళంత ఎక్కువ.. కాళేశ్వర క్షేత్రం. కాశీ లో శివుడిని దర్శించుకుంటే పుణ్యం.. కాలేశ్వరంలో ముక్తేశ్వరున్ని స్మరించకుంటే ముక్తి. అత్యంత ప్రాశస్త్యం కలిగిన పుణ్యక్షేత్రం కాలేశ్వరం. ఓకే పానవట్టంపై ద్విలింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. శ్రావణమాసం ఆదివారం సెలవు దినం కావడంతో కాలేశ్వరం కు భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలనల నుండే కాకుండా మహారాష్ట్ర చత్తీస్గడ్ దూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు వేకువజాము నుండి త్రివేణి సంగమ తీరం పుష్కర ఘాటులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ప్రధాన దేవాలయంలో శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామికి గోదావరి జలాలతో పంచామృత అభిషేకాలు చేశారు. మారేడు పత్రి, కల్వ పూలతో శివునికి పూజలు నిర్వహించారు. సాధారణ దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. శుభానంద్ దేవి, సరస్వతి అమ్మవార్లకు భక్తులు కుంకుమ పూజలు చేశారు.