Mahaa Daily Exclusive

  గ్రేటర్ వరంగల్ లో ఘనంగా తీజ్ ఉత్సవాలు కమిటీ సభ్యులతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ..!

Share

హన్మకొండ మహా;

గ్రేటర్ వరంగల్ లో ఈనెల 12 నుండి తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ అన్నారు. గురువారం హనుమకొండలోని గిరిజన భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తీజ్ తేదీల పోస్టర్ను రిటైర్డ్ జెడిఎ జాటోతు ధర్మనాయక్ , నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ను మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ.. 12.8.2025 మంగళవారం గోధుమలు నానబెట్టుట 13.8.2025 బుధవారం గోధుమ లను బుట్టలో విత్తడం 14.8.2025 గురువారం బోరడి తీజ్ 15.8.2025 నుండి 16,17,18 వరకూ రోజువారి కార్యక్రమాలు. 19.8.2025 మంగళ వారం ఢమోలీ తీజ్ 20.8.2925 బుధవారం రోజున గణ్ గోర్ తీజ్ , 21.8.2025 గురువారం రోజున (కడావ్, సేవాలాల్ మహారాజ్ భోగ్, మేరమ యాడిన బోకడేరో పూజ) తీజ్ పండుగ వేడుకను నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీజ్ పండుగ పురస్కరించుకొని సెలవు దినంగా ప్రకటించాలని, రాష్ట్ర పండుగగా తీజ్ ను గుర్తించడం తో పాటు తమ సంస్కృతి సాంప్రదాయ వేడుకలు గిరిజన భవన్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఈ వేడుకకు రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని , గ్రేటర్ లోని గోర్ బంజారా లందరూ 12వ తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రతి రోజు జరిగే ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు వినోద్ లోక్ నాయక్, గుగులోతు రాజు నాయక్, మాలోతు నాను నాయక్ బాదావత్ బాలాజీ నాయక్, కేలోతు బిక్షపతి, భూఖ్య రాజు నాయక్, డాక్టర్ మాలోతు చందు నాయక్, భూక్యా సాంబయ్య నాయక్, బోడ నరసింహ నాయక్, ధరావత్ కిషన్ నాయక్, డుంగ్రోత్ కిషోర్ , భూక్య భద్ర, మాలోతు రమేష్ తదితరులు, పాల్గొన్నారు