ముదిగొండ ఆగస్టు15 మహా:
79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ వాసిరెడ్డి శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సువర్ణాపురం గ్రామం నుండి రోజు నడుచుకుంటూ ముదిగొండ కళాశాలకు వచ్చి ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న నిరుపేద విద్యార్థిని,పల్లవికి ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ వాసిరెడ్డి శ్రీనివాస్ సైకిల్ ను వితరణగా అందజేశారు.ఈసందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశం యొక్క గొప్పతనాన్ని,దేశ స్వతంత్రం కోసం కృషి చేసిన మహనీయులు వారి త్యాగాల గురించి విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.విద్యార్థులు ఉన్నత పౌరులు ఎదిగిన్నాడే,జీవితానికి సార్ధకత ఏర్పడుతుందన్నారు.పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.క్రీడా శాఖల నుండి గెలుపొందిన విద్యార్థి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో ఏజీఎంఓ గురవయ్య,స్టూడెంట్ కౌన్సిలర్స్ ఆమోస్,ఉషారాణి,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మోదుగు వెంకటేశ్వర్లు,అధ్యాపకులు రమణ,సతీష్ రెడ్డి,అక్రమ్,రామారావు,లక్ష్మణ్ బాబు,సుమతి,దుర్గాదేవి అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.








