Mahaa Daily Exclusive

  భద్రాద్రిలో పెరుగుతున్న గోదావరి తాలిపేరు 3, కిన్నెరసాని ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల…!

Share

మహా భద్రాచలం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నెమ్మదిగా పెరుగుతుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు 19.90 అడుగులు ఉన్న గోదావరి, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 26.5 అడుగులకు పెరిగింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తి 2355 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి విడుదల చేశారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ కు 1400 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది.దీంతో ఒక గేట్ ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న కిన్నెరసాని నదిలోకి వదిలారు.