Mahaa Daily Exclusive

  విద్యార్థులకు చేయూతనిస్తున్న జ్యోతి కిరణ్….!

Share

అశ్వాపురం, మహా.
నెల్లిపాక బంజర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అటెండర్ జ్యోతి కిరణ్ మానవత్వంతో ముందుకు వచ్చి దూరప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల రవాణా ఖర్చుల కోసం ప్రతినెల తన జీతం నుండి ₹6,000 అందించనున్నట్లు ప్రకటించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ నిర్ణయం వెల్లడించారు.

గత రెండు సంవత్సరాలుగా గ్రామస్థులు, పెద్దలు కలసి ఈ ఖర్చులు భరించగా, ఈసారి దాతలు ముందుకు రాకపోవడంతో విద్యార్థులు చదువు మానే పరిస్థితి ఏర్పడింది. దీనిని గమనించిన జ్యోతి కిరణ్ విద్యార్థుల భవిష్యత్ కోసం ఈ సహాయం చేయాలని నిర్ణయించారు.

ఆయన స్ఫూర్తితో హిందీ ఉపాధ్యాయుడు రాంబాబు, పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ అక్కిన అచ్యుతరామారావు తలో నెలకు ₹10,000 చొప్పున రవాణా ఖర్చుల కోసం అందించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మరికొందరు దాతలు ముందుకు రావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అప్కా శంకర్ ఆధ్వర్యంలో జ్యోతి కిరణ్‌కు శాలువాతో సత్కారం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.