నేలకొండపల్లి, ఆగస్టు 15 మహా:
ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఒక పక్క రైతులు పంట పొలాలు మునిగిపోయాయి..కొందరికి మాత్రం ఉపాధి దొరికింది… మండలం లోని నేలకొండపల్లి, ముజ్జుగూడెం, అనాసాగారం, నాచేపల్లి, చెరువుమాధారం తదితర గ్రామాలలో చెరువులు, వాగులు నిండి కళకళాలాడుతున్నాయి. కొత్త నీరు రాకతో చేపలు దండిగా వచ్చాయి. ఇంకేంముంది. వివిధ ప్రాంతాల కు చెందిన వారితో పాటు స్థానిక జాలర్లు వలలతో చేపల వేట సాగించారు. చెరువులు వద్ద సందడి నెలకొంది. జాలర్ల వలలు నిండిపోయాయి. దాదాపు మూడు టన్నుల చేపలను విక్రయించారు. కిలో రూ.100 కు విక్రయించటంతో ప్రజలు ఎగబడి తీసుకెళ్లారు. ఇది ఇలా ఉండగా ఇలాంటి సందర్భలాలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాలర్లకు అధికారులు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Post Views: 81








