జూలూరుపాడు, ఆగస్టు 18, (మహా): పంటచేలకు వెళ్లడానికి దారి సౌకర్యం కల్పించాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు రైతులతో కలిసి స్థానిక తహశీల్దార్ టి శ్రీనివాస్ కి వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. మండల పరిధి గుండ్లరేవు గ్రామానికి చెందిన రైతులు వారి పంట పొలాలకు వెళ్లడానికి రాంపురం గ్రామం పక్క నున్న ఆర్ఓఎఫ్ఆర్ లైన్ మధ్యలో ఉన్న పాత దారి నడవడానికి అసౌకర్యంగా ఉన్నందున ఆ దారిని రైతులు పంట పొలాలకు వెళ్లడానికి అనుకూలంగా రెవిన్యూ అధికారులు హద్దులు చూపెట్టాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో పార్టీ డివిజన్ కార్యదర్శి జాటోత్ కృష్ణ, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎదులాపురం గోపాలరావు, ఏఐయుకేఎస్ డివిజన్ కార్యదర్శి బానోతు ధర్మ, రైతులు మలకం వెంకటేశ్వర్లు, తెల్లం పాపయ్య, కాలం కోటేశ్వరరావు, తెల్లం రాజేశ్వరరావు, మలకం సతీష్, తెల్లం కృష్ణయ్య, తాటి నరసింహారావు, ఎట్టి బాబు తదితరులు ఉన్నారు.







