Mahaa Daily Exclusive

  ఖమ్మం జిల్లాకు చారిత్రాత్మకంగా 14 ఎకరాలలో రెండు క్రికెట్ మైదానాలు ..!

Share

ఖమ్మం, మహా:

ది న్యూస్ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కే ఎల్ సి నందు జీళ్ళచెరువు గ్రామంలో సూర్యాపేట హైవే ప్రక్కన నూతనంగా నిర్మించబడుతున్న క్రికెట్ మైదానా లకు సంబంధించిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇది ఖమ్మం జిల్లాకు చారిత్రాత్మకంగా నిలుస్తుందని అన్నారు. ఖమ్మం పట్టణం నుండి సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో గల ఆగ్రహారం గ్రామము లో 14 ఎకరాల స్థలంలో రెండు క్రికెట్ మైదానాలు జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆటకు సరిపోయే విధంగా నిర్మించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారు లలో ఉన్న సృజనాత్మకతను పెంపొందించుటకు 10 ప్రాక్టీస్ నెట్స్ లను స్విమ్మింగ్ పూల్ రూపొందించుచామని, ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం ద న్యూ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్నట్టు ప్రెసిడెంట్ బుర్రి నాగేశ్వరరావు తెలియజేశారు . అసోసియేషన్ కార్యనిర్వాహణ అయిన ఎండి మసూద్ అసోసియేషన్ యొక్క జర్నీని క్లుప్తంగా వివరిస్తూ 1998 సంవత్సరంలో స్థాపించిన ఈ సంస్థ యొక్క ఉద్దేశాన్ని వంతుల వారీగా వివరిస్తూ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అని గ్రామీణ ప్రాంతంలో గల క్రీడాకారులను మంచి శిక్షణ ఇస్తూ గ్రామస్థాయి నుండి జిల్లా మరియు రాష్ట్రస్థాయి వరకు అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా రూపొందించడం సర్టిఫైడ్ మరియు సీనియర్ కోర్తులచే శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు . శిక్షణ పొందుతున్న అటువంటి క్రీడాకారులకు , జిల్లాలలో మరియు రాష్ట్రస్థాయిలలో మ్యాచ్లను నిర్వహించడం . నిపుణులు అయిన జాతీయస్థాయి క్రీడాకారులతో సూచనలు మరియు సలహాలను క్రికెట్ యొక్క మెలకువలను నేర్పించడం జరుగుతుంది . అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ డి కాసిం పాషా నూతనంగా నిర్మించబోతున్న క్రికెట్ మైదానాలను క్లుప్తంగా వివరిస్తూ ఈ రెండు గ్రౌండ్లలో ఒక గ్రౌండ్ను అంతర్జాతీయ స్థాయి తగ్గట్టుగా 75 మీటర్ల బౌండరీ తోను మరియు 4 టూర్ఫ్ వికెట్ ను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని , రెండవ గ్రౌండ్ ని శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ఫీల్డ్ లో అనుభవాన్ని పెంపొందించుటకు తగు విధంగా శిక్షణ మరియ నిర్మించబడుతున్నదని 10 క్రికెట్ నెట్స్ లను క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం రూపొందించడం. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా సీనియర్ కోచ్ అయిన విజయ్ కుమార్, ద న్యూ ఖమ్మం డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన సేవలను కొనియాడారు మిగిలిన కోచలు దివ్య ప్రకాష్, దుర్గ, ఆసిఫ్, శివ వారి యొక్క అనుభవాలను తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎండీ మాసూద్ పాషా, ఎండీ ఫరూక్ ఖాన్, బి సందీప్, బి నగేష్ , ఎస్.డి ఖాసీం, ఎస్.కె యాకుబ్ పాషా, జి వాసు, ఎస్.కె గాయాజ్ తదితరులు పాల్గొన్నారు.

Latest