Mahaa Daily Exclusive

  వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువు వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం తేవాలి ఎన్నికల హామీలన్ని నేరవేర్చాలి – తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ..!

Share

కారేపల్లి, మహా : వ్యవసాయ యంత్రీకరణతో వ్యవసాయ పనులు తగ్గాయి. ఏడాదికేడాది ఉపాధి హమీ పధకం కు నిధులు కుదిస్తుండటంతో కూలీలకు ఉపాధి కరువతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ లు తెలిపారు. ఆదివారం కారేపల్లి మండల వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభ జరిగింది. ఈమహాసభలో వారు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా వ్యవసాయ కూలి రేట్లు పెరగటం లేదన్నారు. వ్యవసాయ కూలీలు ఐక్యతతోనే కూలీ రేట్లు పెంచుకోవటం సాధ్యమన్నారు. కూలి రేట్లు పెంపుతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పధకంకు బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తుందని, పధకం అమలులో కొత్త నిబంధనలు విధించి కూలీలకు ఉపాధి దూరం చేస్తుందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా మోడి ప్రభుత్వం రూ. 50.60 లక్షల కోట్ల బడ్జెట్ లో కేవలం రూ.69 వేల కోట్లు కేటాయించి ఉపాధి కూలీలకు కూలి గిట్టుబాటు కాకుండా అన్యాయం చేస్తుందని విమర్శించారు . పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని అమలు జరపటంలో ప్రభుత్వాలు ద్వంద వైఖరి అవలంబిస్తున్నాయని, ఏళ్ల తరబడి పోడు సాగు చేస్తున్న గిరిజనేతరులకు నేటికి హక్కు పత్రాలు ఇవ్వలేదన్నారు. పోడు సాగు చేస్తున్న గిరిజనేతరులకు హక్కు పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. పోడు సాగు పై ఆంక్షల తో పేదలను వ్యవసాయం దూరం చేసే ప్రయత్నం కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్లాంటేషన్ పేరుతో పేదల భూము లాక్కొని, ప్రత్యామ్నాయ భూమి చూపించకుండా ఫారెస్ట్, పోలీస్ నిర్బంధాలు ప్రయోగిస్తుందన్నారు. వ్యవసాయ కార్మికుల భద్రత ,రక్షణ, కోసం సమగ్ర కూలి చట్టం తేవాలని, ఆ చట్టం అమలుకి గ్రామపంచాయతీలను వేదికలుగా నిర్ణయించాలన్నారు. కేరళ తరహాలో కూలీలందరినీ పంచాయతీ పరిధిలో నమోదు చేసి పనులన్నింటికీ రేట్లు నిర్ణయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు, మహిళలకు నెలకు రూ.2500 హామీ అమలు ఊసే ఎత్తటం లేదన్నారు. ప్రజలను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. పేదలకు నిత్యావసర వస్తువులను అందించే చౌకదుకాణాలను కేవలం బియ్యం పంపిణి కేంద్రాలు మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చౌకదుకాణాల ద్వారా నిత్యావస వస్తువులు అన్ని అందించాలని డిమాండ్‌ చేశారు.
వ్యకాస మండల కమిటి ఎన్నిక
వ్యవసాయ కార్మిక సంఘం నూతనకమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులు కేసగాని ఉపేందర్‌, కార్యదర్శి యనమనగండ్ల రవి లను ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు యర్రా శ్రీనివాసరావు, కొండబోయిన నాగేశ్వరరావు, తాళ్లపల్లి కృష్ణ, సీఐటీయు మండల కన్వీనర్‌ కే.నరేంద్ర, తుమ్మోజు రాంమ్మూర్తి, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జా రామారావు, ఐద్వా కార్యదర్శి కే.ఉమావతి, కరపటి రాంబాయి, సూరబాక ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.

Latest