Mahaa Daily Exclusive

  సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు ఇవ్వాలి తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ …!

Share

మంచిర్యాల, మహా : తెలంగాణ రాష్ట్రంలో సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మందులు ఇవ్వాలని తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య సుమారు 10 నుంచి 12,000 వేల మంది ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యాధి జన్యు పరంగా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధనీ, ఇది దీర్ఘకాలికంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ వ్యాధి బారిన పడ్డ వ్యాధిగ్రస్తులు జీవితాంతం మందులు వాడవలసి ఉంటుందని వెల్లడించారు.
హైడ్రాక్స్యూరియా, సోడా మింట్, పెంటేడ్స్, టాబ్లెట్లు ప్రభుత్వము ఉచితంగా అందించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ వైద్యశాలలో వివిధ రోగాల బారిన పడ్డ ప్రజలకు ఏ విధంగా మందులు ఇస్తున్నారో అదే విధంగా మందులను రాష్ట్రంలోని ప్రతి జిల్లా హాస్పిటల్, పీహెచ్సీలో అందుబాటులో ఉంచి ఆశా వర్కర్ల ద్వారా గ్రామాలలో ఉన్న సికిల్ సెల్ పేషెంట్లకు అందజేయాలని, ఇది నిరంతర ప్రక్రియగా చేపట్టాలని వివరించారు. ఈ వ్యాధి ఆదివాసి గిరిజన జిల్లాలలో ఎక్కువగా ఉందని అన్నారు.

Latest