Mahaa Daily Exclusive

  జైనథ్ మండలంలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో కంది శ్రీ‌నివాస రెడ్డి ప‌ర్య‌ట‌న పంట పొలాలు, రోడ్లు, వంతెనల పరిశీలన..!

Share

ఆదిలాబాద్ మ‌హా : పంట ,ఇండ్లు న‌ష్ట‌పోయిన బాదితులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం జైనథ్ మండ‌లంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. మండలంలోని పెండల్ వాడ, ఆనంద్ పూర్,సాంగ్వి,కరంజి గ్రామాల‌లోని వరద ప్రభావిత ప్రాంతాలలో తిరిగి రైతుల‌ను ప్ర‌జ‌ల‌ను ఓదార్చారు. ఇటీవ‌ల భారీ వ‌ర్షాల ధాటికి దెబ్బ తిన్న పంటపొలాలు రోడ్లు, బ్రిడ్జి లను పరిశీలించారు. బాధిత రైతులను ప్రభుత్వం తప్పకుండ ఆదుకుంటుందని భ‌రోసా క‌ల్పించారు. ఈకార్య‌క్ర‌మంలో గిమ్మ సంతోష్,భూమారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రుకేష్ రెడ్డి, జగదీష్ రెడ్డి, రాకేష్, అశోక్ ,విట్టల్ రెడ్డి , కాప్రిరాంరెడ్డి కొండా గంగాధర్ ,MA షకీల్ , బెల్లూరి రాంరెడ్డి ,పోత రెడ్డి,వసంత్, తింగం నరేష్, అనిల్ రెడ్డి,మహ్మద్ షరీఫ్,పోచన్న సంజీవ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Latest