Mahaa Daily Exclusive

  నిర్మ‌ల్ జిల్లాలో చోరీ..!

Share

నిర్మ‌ల్ మ‌హా : జిల్లాలో దొంగ‌లు గుడుల‌ను టార్గెట్ చేసారు. అధికారులు ప్ర‌జ‌లు అంద‌రూ వినాయ‌క నిమ‌జ్జ‌నాల్లో నిమ‌గ్న‌మై ఉండ‌డంతో సంద‌ట్లో స‌డేమియాలా చోరులు గుళ్లో చొర‌బ‌డ్డారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గాయత్రి మాత ఈశ్వరి దేవి విగ్ర‌హాల‌పైనుండి బంగారు ఆభ‌ర‌ణాలు కాజేసి హుండీ ఎత్తుకెళ్ళారు. తర్లపాడ్ గ్రామంలోని ఓం కారేశ్వర,అగ్గిమల్లన్న దేవాలయంలోనూ దొంగ‌లు త‌మ చేతి వాటం ప్ర‌ద‌ర్శించారు. దేవాలయంలో ఉన్న సీసీ కెమెరా ధ్వంసం చేసి ఏమీ దొర‌క‌క పోవ‌డంతో డీవీఆర్ రూటర్ అప‌హ‌రించారు. మొత్తం మూడు ఆల‌యాల‌లో క‌లిపి లక్ష వ‌ర‌కు చోరీ అయ్యిందని ఆయా ఆలయాల కమిటీ స‌భ్యులు తెలిపారు.

Latest