Mahaa Daily Exclusive

  కారేపల్లిలో లంబాడీల రాస్తారోకో బంజరాలపై రాజకీయ కుట్ర తిప్పికొడదాం..!

Share

కారేపల్లి, మహా : కారేపల్లిలో లంబాడీలు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. లంబాడీల జేఏసీ ఆధ్యర్యంలో లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా లంబాడీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనే రాజకీయ కుట్రను తిప్పికొడదామన్నారు. గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకోని లంబాడీలపైజరుగుతున్న విషప్రచారాన్ని అపాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లంబాడీల స్ధితిగతులపై స్పష్టమైన నివేదకను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు బానోత్‌ బన్సీలాల్‌, వాంకుడో కోటేశ్వరరావు, భూక్య సురేష్‌, బానోత్‌ రాములు నాయక్‌, మాలోత్‌ దేవ్‌ సింగ్‌ నాయక్‌, భానోత్‌ శంకర్‌ నాయక్‌, భూక్య రామకోటి రాథోడ్‌, గుగులోత్‌ దంజిలాల్‌, భూక్య సుజాత, గుగులోతు మాన్‌సింగ్‌, మాలోత్‌ బాలు, బానోత్‌ మోహన్‌, అజ్మీర నాగేశ్వరరావు, గుగులోత్‌ మంగ్యా, అజ్మీర బిచ్చానాయక్‌, జర్పల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు

Latest