Mahaa Daily Exclusive

  మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే.. – సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు..!

Share

మణుగూరు, మహా :
మణుగూరు వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విస్తరించే అవకాశం ఉండటంతో రోగులు, వారికి తోడుగా వచ్చిన సేవకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోగులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వారికి అవసరమైన వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్, గౌరీ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పీరినాకి నవీన్, శివాలయం ఆలయ కమిటీ చైర్మన్ కూచిపూడి బాబు, పాతూరి వెంకన్న, బొజ్జ త్రిమూర్తులు, గాండ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest