Mahaa Daily Exclusive

  పార్టీ బలోపేతమే మనందరి లక్ష్యం: శైలాజ రెడ్డి..!

Share

ఖమ్మం, మహా:

పార్టీ అభివృద్ధి, మహిళా కాంగ్రెస్ బలోపేతం, కార్యకర్తల చైతన్యం పెంపుదల మనందరి లక్ష్యమని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శైలజా రెడ్డి సూచించారు. ఆదివారం ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీస్ లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జనరల్ సెక్రటరీ రామాదేవి, సెక్రటరీ పావని పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులు పాల్గొని అత్యధిక సీట్లు గెలిచే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. మహిళా కాంగ్రెస్ ప్రతి గ్రామంలో బలంగా విస్తరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. మహిళల హక్కులు, సమాజంలో వారి పాత్ర, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి చేర్చడానికి అందరూ చురుకుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Latest