Mahaa Daily Exclusive

  రాజీ మార్గమే రాజమార్గం : వైరా ఎస్ఐ

Share

మహా.
మధిర కోర్టు ఆవరణలో ఈ నెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైరా ఎస్ఐ పుప్పాల రామారావు సూచించారు. “రాజీ మార్గమే రాజమార్గం. కక్షలతో ఏదీ సాధించలేం” అని ఆయన పేర్కొన్నారు. రాజీ కుదుర్చుకుంటే ఇరుపక్షాలూ గెలిచినట్టే అవుతుందని అన్నారు.

లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన న్యాయం పొందవచ్చని ఎస్ఐ తెలిపారు. క్రిమినల్, సివిల్, ప్రమాదాల వంటి కేసుల్లో రాజీకి అవకాశం ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Latest