Mahaa Daily Exclusive

  వ్యవసాయ కార్పొరేటీకరణకు మోడీ సర్కార్ కుట్ర: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి గోవిందరావు..!

Share

ఖమ్మం, మహా :

వ్యవసాయ కార్పొరేటీకరణకు మోడీ సర్కార్ కుట్ర చేస్తుందని దేశీయ సంస్థలు మాదిరి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించి రైతులను కూలీలుగా మార్చే యత్నంలో ఉందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి కొండపర్తి గోవిందరావు ఆరోపించారు. దేశంలో కార్పొరేట్ శక్తులకు అంతర్జాతీయంగా అమెరికా ఆంక్షలకు మోడీ తలొగ్గారని -ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మంజిల్లా సమితి సమావేశం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ అధ్యక్షతన స్థానిక గిరిప్రసాద్ భవన్లో ఆదివారం జరిగింది. సమావేశంలో కొండపర్తి గోవిందరావు మాట్లాడుతూ ఇప్పటికే కార్పొరేట్ -శక్తులకు తలొగ్గి వ్యవసాయ రంగ సబ్సిడీలను రద్దు చేసిన మోడీ సర్కార్ ఇప్పుడు పత్తి దిగుమతిపై సుంకాన్ని రద్దు చేయడం భారతదేశ వ్యాప్తంగా పత్తి రైతులను ఆర్థికంగా దెబ్బతీయడమేనని ఆయన తెలిపారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే పత్తిపై గతంలో 11 శాతం పన్ను విధించే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పన్నును పూర్తిగా రద్దు చేసిందని దీని వల్ల దేశ వ్యాప్తంగా రైతులు -పండిస్తున్న పత్తి కంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పత్తి రేటు తక్కువగా ఉండి స్థానికంగా ఉత్పత్తి అయ్యే పత్తికి ధర తక్కువగా ఉంటుందని దీని వల్ల పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటున్న పత్తిపై రద్దు చేసిన పన్ను ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాలని యధావిధిగా 11 శాతం పన్నును విధించాలని ఆయన -డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్దమైన మద్దతు ధర కోసం -సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తుందని ఆ క్రమంలోనే ఖమ్మంలో ఈనెల 10న ఉదయం 10 గంటలకు స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సదస్సును నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర రైతు -సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాగం హేమంతరావు, పర్ష పద్మ, ఇతర రైతు సంఘాల బాధ్యులు హాజరవుతున్నారని గోవిందరావు తెలిపారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై సదస్సును జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, కూచిపూడి రవి, ఏపూరి రవీంద్రబాబు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, పావులూరి మల్లికార్జున్, వెంకటనర్సయ్య, పుచ్చకాయల సుధాకర్, మార్గం శ్రీనివాస్, దొబ్బల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest