Mahaa Daily Exclusive

  కంది శ్రీ‌నివాస రెడ్డి ప‌రామ‌ర్శ‌లు..!

Share

ఆదిలాబాద్ మ‌హా : బాధలో దుఖంలో ఉన్న కుటుంబాలకు ధైర్యం చెబుతూ అండగా నిలబడతారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి.ఆప్తులను కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న కుటుంబాలకు , అనారోగ్యంతో బాధపడుతున్న వారి చెంతకు వెళ్లి పరామర్శించి నేనున్నానంటూ కొండంత భరోసా కల్పిస్తారు. ఆదిలాబాద్ ప‌ట్ణంలోని ఓల్డ్ హౌజింగ్ బోర్డ్ కు చెందిన నానాజీ బెదోడ్క‌ర్ గుండె పోటుతో మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న నివాసంలో కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.విద్యానగర్ కాలనీకి చెందిన బద్దం రమ అనారోగ్యతో మృతి చెందడంతో ఆమె కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం కంది శ్రీ‌నివాస రెడ్డి ద‌గ్గ‌రి బంధువు భీంపూర్ మండ‌లం నిపాని గ్రామానికి చెందిన గోపిడి నాగారెడ్డి సతీమణి గోపిడి అనిత ఇటీవల మృతి చెందడంతో ఆయ‌న నివాసానికి వెళ్లి నాగారెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్య‌క్తం చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ నాయ‌కులు గిమ్మ సంతోష్ రావు, సామ రూపేష్ రెడ్డి,మల్లన్న యాదవ్, తమ్మల చందు , డేరా కృష్ణారెడ్డి, నరేష్ రెడ్డి, అఖిల్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest