Mahaa Daily Exclusive

  అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

Share

మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా పరిధిలో ఎవరైనా అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో డి.సి.పి. ఎ భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, బెల్లంపల్లి సబ్-కలెక్టర్ మనోజ్ లతో కలిసి తహశిల్దార్లు, పోలీసు శాఖ అధికారులు, అటవీ రేంజ్ అధికారులతో అటవీ భూముల ఆక్రమణల నిరోధంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆక్రమణల నిరోధానికి పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో జిల్లా టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. అయినా అటవీ చట్టాలను ఉల్లంఘించి అటవీ భూముల ఆక్రమణ పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాలలో ఆక్రమణ గురైన అటవీ భూమిలను గుర్తించి
ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, సి.ఐ.లు, జన్నారం తహశిల్దార్ రాజ మనోహర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Latest