Mahaa Daily Exclusive

  ఎస్సి,ఎస్టి కేసు ఫిర్యాదులను సత్వర మే పరిష్కరించాలి ..తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్..!

Share

బెల్లంపల్లి, మహా: మంచిర్యాల జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా జిల్లాగా అధికార యంత్రాంగం దృష్టి సారించా
లని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమి
షన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ పేర్కొ
న్నారు. మంగళవారం రోజు మంచిర్యా
ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావే
శ మందిరంలో జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్,తెలంగాణ రాష్ట్ర ఎస్సి,
ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్,మంచిర్యాల డిసిపీ భాస్కర్ ల ఆధ్వర్యంలో ఎస్సి,ఎస్టీఅట్రాసిటీ,విజి
లెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఎక్స్ గ్రేషియాను త్వరగా ఇప్పించాలని అలాగే ఎస్సి,ఎస్టి కేసు ఫిర్యాదులను ఎలాంటి జాప్యం చేయకుండా కేస్ రిజి
స్టర్ చేయాలని,అట్రాసిటీ కేసులలోత్వ
రగా ఇన్వెస్టిగేషన్ చేయాలనీ,హత్య కాబడిన కుటుంబాలకు,హత్యాచార బాధితులకు డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లను మంజూరు చేయాలని,కుల ధ్రువీకరణ పత్రాలను ఆలస్యం చేయ
కుండా త్వరగా మంజూరు చేయాలనీ తాసిల్దార్ లకు కలెక్టర్ ఆదేశాలుఇవ్వా
లని ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రవీ
ణ్ తెలిపారు.ఈ సమావేశంలో బెల్లం
పల్లి సబ్ కలెక్టర్ మనోజ్ , డి ఎస్ డి ఓ దుర్గప్రసాద్,ఎస్సి,ఎస్టీ కోర్ట్ పిపి రమణారెడ్డి, వయోజన అధికారి పురు
షోత్తం నాయక్,మంచిర్యాల,బెల్లంపల్లి ఏసీపీ లు ప్రకాష్ ,రవికుమార్,సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు, డీవీఎంసీ సభ్యులు పాల్గొన్నారు.

Latest