AP: దసరా సెలవుల్లో మార్పులు చేయాలని ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్లకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. అయితే ఈ నెల 22 నుంచే దసరా పండుగ మొదలవుతుందని, ఆ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. అలాగే డీఎస్సీ నియామకాలకు ముందే అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లను పూర్తి చేయాలన్నారు.
Post Views: 36






