Mahaa Daily Exclusive

  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మళ్ళీ నిర్వహించండి: దాసోజు శ్రవణ్‌

Share

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్  గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను బేషరతుగా హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే విద్యార్థుల గొంతు కోసినట్లేనని, తమ తప్పును ఒప్పుకుని పరీక్షను రద్దు చేయాలని ఆయన అన్నారు. గ్రూప్ 1 పోస్టుల్లో జరిగిన అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులను బయటపెట్టాలని ఆయన కోరారు.

Latest