Mahaa Daily Exclusive

  నానమ్మ, మనవరాలు అనుమానస్పద మృతి –మంచిర్యాల హమాలీవాడలో ఘటన ..!

Share

మంచిర్యాల, మహా : మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధి హమాలివాడలో నానమ్మ సత్యవతి (50) మనవరాలు శిరీష (4) అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బుధవారం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… బెజ్జాల సత్యవతి (54) అనే మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారని అన్నారు. ఒకరు హిజ్రాగా మారాగా మరొకరు గోపాలవాడలో నివాసముంటు కొంతకాలం క్రితం అతడు మృతి చెందినట్లు చెప్పారు. గత కొన్ని రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లు సమాచారం. కాగా తిరిగి వచ్చిన కుమారుడికి ఆరోగ్య సమస్య రావడంతో ఖమ్మంకు వెళ్ళిపోయినట్లు
సమాచారం. ఈ క్రమంలో తల్లి, కుమారుడు ఖాళీగా ఉన్న వారి నివాసాన్ని అమ్మడం కొరకు కొంతమంది బ్రోకర్లకు తెలిపినట్లు తెలుస్తోంది. వెళ్లిన కొడుకు బుధవారం తల్లికి ఫోన్ చేయగా ఎంతకు తీయకపోవడంతో ఇంటి పక్కన వారికి సమాచారం అందించిన ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బ్లూ కోల్ట్‌ సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లేసరికి పడక గదిలో బెడ్ పై నానమ్మ, మనవరాలు నిర్జీవంగా ఉన్నారని చెప్పారు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా…? లేక హత్యనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు వెల్లడించారు.

Latest