ఆదిలాబాద్ మహా : ఇటీవల వర్షాలకు కలెక్టరేట్లోని పై అంతస్తు కూలిపోవడంతో అక్కడ ఉన్న కార్యాలయాలను తరలించే పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఆదివారం కూలిన ప్రదేశంలోని పెచ్చులను తొలగించడంతో పాటు పక్కనే ఉన్న జడ్పి కార్యాలయంలో పలు కార్యాలయాలను తరలించేల శుభ్రత చర్యలు చేపట్టారు. ఇప్పటికే కలెక్టరేట్లోకి ఎవరిని అనుమతించకుండా తాళలు వేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ కార్యాలయాలను జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న పెన్ గంగా భవన్లోకి, జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ, ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలను తరలించనున్నారు. జిల్లా పరిషత్లో తగిన గదులు సరిపోవని ఆర్డీఓ కార్యాలయాన్ని ఎంపీడీఓ కార్యాల ప్రాంగణంలోని పాత రాజీవ్ విద్యామిషన్ కార్యాలయంలోకి మర్చాలని యేచిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం నుంచి మార్పు చేసిన కార్యాలయాల నుంచే పాలన సాగించేల అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.






