తల్లాడ, సెప్టెంబర్, 14( మహా):- వికలాంగులు, వితంతువులు, వృద్ధులు ,ఒంటరి మహిళల ఆసరా పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ 15వతేదిన (సోమవారం )జరిగే తల్లాడ తహశీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు దుద్దుకూరి సురేష్ పిలుపు నిచ్చారు.ఆదివారం తల్లాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు నెలకు వికలాంగులకు రూ.6వేలకు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.4వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి 21నెలలలైనా పెంచకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు.ఆసరా పింఛన్లు పెంపు కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.సమావేశంలో వి హెచ్ పి ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు మోదుగు కృష్ణ, ఎమ్మార్పీఎస్ మండల కమిటీ అధ్యక్షుడు ఎక్కిరాల నాగేశ్వరరావు, నాయకులు తడికమళ్ళ కృష్ణ, రావూరి కృష్ణ, అద్దంకి నరసింహారావు,తేళ్ళపుట్ట ఆదాం, యేసయ్య తదితరులు పాల్గొన్నారు.






