వరంగల్ మహా;
గ్రేటర్ వరంగల్ నగరంలో వీధి కుక్కల బెడద తీవ్రతరమైంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా వీధి కుక్కలు కండలు పీకుతున్నాయి. బల్దియా అధికారులు లక్షల నుంచి కోట్లు నిధులు ఖర్చుపెట్టిన ఫలితం శూన్యంగా కనిపిస్తుంది. ఆయా డివిజన్ల లో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా గతంలో చిన్నారుల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం చూసాం. ఇంటి నుండి బయటికి వెళ్లాలంటే
ప్రజలు భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే బందీలై పోతున్నారు. వరంగల్ డిప్యూటీ మేయర్ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న
36వ డివిజన్ చింతల్ లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ మనుషుల పై తీవ్రంగా దాడులు చేస్తున్నాయి. ఆదివారం
ఒకేరోజు 18 మంది పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాయి.
కుక్కల భయానికి ప్రజలు రోడ్డు పై నడవాలంటే నే భయపడు తున్నామని డివిజన్ ప్రజలు వాపోతున్నారు. ఇంత జరిగినా
మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా
స్టడీ టూర్ పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు టైం పాస్ చేస్తున్నారని లక్షల ప్రజాధనం తో జల్సాలు చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. మున్సిపల్ అధికారులు
తక్షణమే చర్యలు తీసుకోకపోతే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తామని
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి ఆడెపు వెంకటేష్ హెచ్చరించారు.






