వరంగల్ మహా;
వరంగల్ తూర్పు నియోజకవర్గం
21వ డివిజన్ లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అయూబ్ మాతృమూర్తి కొద్ది రోజుల కిందట మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఇతర పార్టీ నేతలు పార్టీలకు అతీతంగా అయూబ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. మూడు రోజుల క్రితం బిజెపి రాష్ట్ర నాయకులు, శనివారం కాంగ్రెస్ పశ్చిమ ఎమ్మెల్యే, అదే రోజు రాత్రి మంత్రి కొండా సురేఖ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆదివారం బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్వయంగా అయూబ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం నన్నపునేని నరేందర్ 21,18, 41 వ డివిజన్ల పరిధిలో ఇటీవల మరణించిన కుటుంబాల నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ ముఖ్య నాయకులు, స్థానిక పెద్దలు, యువజన నాయకులు, పాల్గొన్నారు.






