వరంగల్ మహా;
వరంగల్ తూర్పు నియోజకవర్గం
42 వ డివిజన్ రంగశాయిపేట పుల్లయ్య కుంట లోని స్మశానవాటికలో బల్దియా నిధులతో అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం ప్రారంభోత్సవానికి ముందే గుత్తేదారు పనితనం బయటపడింది. స్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా పక్షులు వాలడానికి నిర్మించిన గద్దెలు
కుంగి పోయాయి.
ఇవి నిర్మించి నాలుగు రోజులు కూడా కాకుండానే కుంగి పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నిర్మాణ పనుల్లో గుత్తేదారు (కాంట్రాక్టర్) నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందని స్థానికులు వాపోతున్నారు. కనీసం
పునాదుల్లో సరైన నాణ్యత లేకపోవడం వల్ల ప్లాట్ ఫారం కాస్త కుంగిపోయిన పరిస్థితి ఏర్పడిందని
లక్షల రూపాయల ప్రజల సొమ్ము నీళ్ల పాలు చేస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణాన్ని కొన్ని రోజుల కిందట స్వయంగా స్థానిక కార్పొరేటర్ పర్యవేక్షించిన ఫలితం ఇలా ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఇందుకు బల్దియా అధికారులు పర్యవేక్షణ లోపం నిర్మాణ పనులను వారు పట్టించుకోక పోవడమే కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల కోసం ప్రజా ధనంతో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యత పాటించని
కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






