Mahaa Daily Exclusive

  జాతీయ మెగా లోక్-అదాలత్ లో 1466 కేసుల రాజీ జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్..!

Share

భూపాలపల్లి, మహా :

జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా, భూపాలపల్లి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 1466 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ఎస్పీ కిరణ్ కరే ఒక ప్రకటనలో తెలిపారు.
ఐ.పి.సి & BNS కేసులు 355, సైబర్ క్రైమ్ 15,
డి.డి & MV యాక్ట్ – 1096 కేసుల్లో ఇరు వర్గాలను రాజీ కుదిర్చి సమస్యలను సత్వర పరిష్కారం చేసినట్లు ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం చేయడం లోక్-అదాలత్ ప్రధాన ఫలితం. 15 సైబర్ క్రైమ్ కేసులలో రూ. 88 వేలు మొత్తాన్ని తిరిగి సైబర్ బాధితుల ఖాతాల్లో జమ చేయడానికి సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు ఆర్డర్ కాపీలు పంపినట్లు తెలిపారు. బాధితులకు ఈ సహాయం ఒక పెద్ద ఉపశమనంగా నిలిచింది.
జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే ఐపిఎస్. గారు మాట్లాడుతూ లోక్-అదాలత్ అనేది క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అద్భుతమైన వేదిక. చిన్న గొడవలు, వివాదాలు కోర్టుల్లో సంవత్సరాల తరబడి నిలవకుండా, ఇరు వర్గాలు రాజీ మార్గం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. రాజీ మార్గమే రాజమార్గం అనే భావన ప్రతి ఒక్కరికి ఉండాలి అని అన్నారు.
జిల్లాలో జరిగిన ఈ లోక్-అదాలత్ లో కృషి చేసిన పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, సైబర్ క్రైమ్ యూనిట్ ను మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.లోక్-అదాలత్ వంటి వేదికలు సమాజంలో శాంతి నెలకొల్పడంలో కీలకపాత్ర పోషిస్తాయని, ప్రజలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఎస్పీ తెలిపారు.

Latest