Mahaa Daily Exclusive

  ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌క్క‌టి వేదిక ప్ర‌జా ద‌ర్బార్ ప్ర‌జ‌ల‌నుండి స‌మ‌స్య‌ల‌పై విన‌తులు స్వీక‌రించిన‌ కంది శ్రీ‌నివాస రెడ్డి …!

Share

ఆదిలాబాద్ మ‌హా : నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే ప్ర‌జా ద‌ర్భార్ నిర్వ‌హిస్తున్న‌ట్టు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీ‌నివాస రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం ప‌ట్ఱ‌ణంలోని త‌న‌ క్యాంపు కార్యాల‌యం ప్రజా సేవ భవన్ లో నిర్వ‌హించిన‌ ప్రజా దర్భార్ కు నియోజకవర్గంలోని న‌లుమూల‌ల‌నుండి ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో త‌ర‌లివ‌చ్చారు. వ‌చ్చిన వారంద‌రితో ప్ర‌జాసేవాభ‌వ‌న్ కిక్కిరిసిపోయింది. ప్రజలు తమ సమస్యలను కంది శ్రీనివాస రెడ్డి కి వివ‌రించి వినతి పత్రాలు అందించారు.ప్ర‌తి ఒక్క‌రి సమస్యను ఓపిక‌గా విని సానుకూలంగా స్పందించారు. ప‌లు సమస్యలపై ప్ర‌జ‌లిచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను మంత్రులు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ వ‌ద్ద‌కు చేర్చి ప‌రిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీ‌నివాస రెడ్డి తెలిపారు.ప్ర‌తీ వారం నిర్వ‌హించే ప్ర‌జాద‌ర్భార్ లో ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు తెలియప‌రిచి సద్వినియోగప‌ర్చుకోవాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో గిమ్మ సంతోష్ , మునిగెల న‌ర్సింగ్ , సామ రూపేష్ రెడ్డి ,నాగ‌ర్కర్ శంక‌ర్ , అల్చెట్టి నాగ‌న్న , ఫైజుల్లా ఖాన్ , గుడిప‌ట్టి న‌గేష్, కొండ గంగాధ‌ర్, బండారి స‌తీష్ , సందాన‌ర్సింగ్, రామ్ కుమార్ లోక‌ప్ర‌వీణ్ రెడ్డి, మంచాల మ‌ల్ల‌య్య‌, రావుల సోమ‌న్న యాద‌వ్,ర‌మేష్ రాంరెడ్డి ,మ‌హ‌మూద్ ,ల‌త‌, సోనియామంథ‌ని, ఉయిక ఇందిర త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest