Mahaa Daily Exclusive

  ప్రపంచ అంతరిక్ష వారోత్సవం -2025 లో పాల్గొన్న ఎమ్మెల్యే బేబీ నాయన..

Share

విజయనగరం,మహా పత్రిక.

బొబ్బిలి పట్టణం లో రాజా ఆర్. ఎస్. ఆర్. కే. రంగారావు కళాశాలలో ఈరోజు నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవం -2025 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన పాల్గొన్నారు.సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎస్.డి.ఎస్.సీ – షార్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ బొబ్బిలి ప్రాంతపు చారిత్రక మరియు ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ, అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతికత యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయాలను మరియు ఆపరేషన్ సింధూర్ లో ఇస్రో చేసిన సేవలను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ప్రపంచ అంతరిక్ష వారం నిర్వాహక కమిటీ చైర్మన్ టి.కృష్ణ, ఎస్.డి.ఎస్.సీ – షార్ కంట్రోలర్ మరియు డిప్యూటీ డైరెక్టర్ జి.రమేష్, డబ్ల్యు.ఎస్.డబ్ల్యు – 2025 సభ్య కార్యదర్శి ప్రదీప్ నాయక్ , కళాశాల జాయింట్ సెక్రటరీ రావు బదరీ, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.