Mahaa Daily Exclusive

  ఏపీలో భారీగా ఐఎఎస్ ల బదిలీలు

Share

  • ఏపీలో భారీగా ఐఎఎస్ ల బదిలీ
  • ఒకేసారి 31 మందికి స్థానచలనం
  • సమాచారశాఖ డైరెక్టర్ గా కేఎస్ విశ్వనాథన్

అమరావతి, మహా

ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాలనా వ్యవస్ధలో కీలకమైన ఐఎఎస్ లలో 31 మందిని ఒకేసారి బదిలీ చేసింది. ఇందులో పలువురు డైరెక్టర్లు, కార్యదర్శులు, సబ్ కలెక్టర్లు కూడా ఉన్నారు. వీరిలో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కొంతమందికి పోస్టింగ్ లు కూడా దక్కాయి. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కేవీఎన్ చక్రధర్ బాబును వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ గా నియమించారు. మంజీర్ జిలానీని ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ, మార్క్ ఫెడ్ ఎండీగా కూడా బాధ్యతలు అప్పగించారు. రవి సుభాష్ ను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా నియమించారు. శివశంకర్ ను ఏపీఎస్పీడీపీఎస్ ఎండీగా నియమించారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావును పౌరసరఫరాల కార్పోరేషన్ ఎండీగా నియమించారు.ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా రంజిత్ బాషాను, హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా అరుణ్ బాబును, సీసీఎల్ఏ అదనపు కార్యదర్శిగా జేవీ మురళిని, సీసీఎల్ ఏ సంయుక్త కార్యదర్శిగా చేతన్ ను, వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా నవ్యను, ఎయిర్ పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను, సమాచారశాఖ డైరెక్టర్ గా కేఎస్ విశ్వనాథన్ ను, పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ గా గోవింద రావును, ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా చిన్న రాముడిని, ట్రాన్స్ కో జేఎండీగా ప్రవీణ్ చంద్ ను నియమించారు. అలాగే బాపట్ల జేసీగా భావనకు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప కార్యదర్శిగా విష్ణు చరణ్ కు, వైద్యారోగ్యశాఖ డిప్యూటీ సెక్రటరీగా శోభికకు, మారిటైమ్ ఇన్ ఫ్రా డెవప్మెంట్ కార్పోరేషన్ ఎండీ, డైరెక్టర్ గా అభిషేక్ కుమార్ కు, నంద్యాల జేసీగా కార్తీక్ కు, పరిశ్రమలశాఖ డైరెక్టర్ గా శుభం బన్సల్ కు, ఏలూరు జేసీగా అభిషేక్ గౌడకు, కర్నూలు జేసీగా నూరుల్ కామర్ కు, రాజమండ్రి కమిషనర్ గా రాహుల్ మీనాకు, కాకినాడ జేసీగా అపూర్వ భరత్ కు, సత్యసాయి జిల్లా జేసీగా మౌర్య భరద్వాజ్ కు, హౌసింగ్ శాఖ కార్యదర్శిగా వెంకట్ త్రివినాగ్ కు, డైరీ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీగా మురళీధర్ కు పోస్టింగ్స్ ఇచ్చారు. వీరితో పాటు లిడ్ క్యాప్ వీసీ, ఎండీగా ప్రసన్న వెంకటేష్ కు, శాప్ ఎండీగా భరణికి, అల్లూరి సీతారామరాజు జిల్లా జేసీగా శ్రీపూజకు అవకాశం కల్పించారు.

Latest