నిజామాబాద్, మహా: తల్లి మరణంతో దుఃఖంలో ఉన్న నిజామాబాద్ (గ్రామీణ) శాసనసభ్యుడు భూపతి రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్‌లో జరిగిన భూపతి రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు మంత్రి దనసరి అనసూయ సీతక్క, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 55








