Mahaa Daily Exclusive

  తెలంగాణ రైజింగ్ -2047 కోసం సిటిజన్ సర్వే..!

Share

  • ప్రతి పౌరుడు పాల్గొనాలని ప్రభుత్వం రిక్వెస్ట్
  • రోడ్ మ్యాప్ రూపకల్పనలో భాగస్వామ్యం కల్పించాలని సూచన

హైదరాబాద్, మహా: రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగన నిలపడం, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లయ్యే 2047 నాటికి సాధించాల్సిన ప్రగతి లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ప్రజా ప్రభుత్వం సంకల్పించిన తెలంగాణ రైజింగ్ విజన్-2047 రోడ్ మ్యాప్ రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. ఈ రోడ్ మ్యాప్ రూపకల్పనలో ప్రజల ఆలోచనలు, వారి సూచనలను పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని సంకల్పించిన ప్రభుత్వం సిటిజన్ సర్వేను ప్రారంభించింది.

దేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో తెలంగాణ నుంచి పది శాతం మేరకు దోహదపడాలన్న సంకల్పం, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్య సాధనలో భాగంగా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 డాక్యుమెంట్ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని భావించిన ప్రభుత్వం అక్టోబర్ 10 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు సిటిజన్ సర్వేను ప్రారంభించింది. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ కేవలం ఒక పాలసీ పత్రం కాదని, ఆర్థికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, ఆవిష్కరణలు, నెట్-జీరో లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే అనేక అంశాలే ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకునే డాక్యుమెంట్ కోసం ఈ సర్వే ద్వారా తెలంగాణ ప్రజల సమిష్టి ఆకాంక్షను ప్రతిబింబిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు, ఆలోచనలు రాష్ట్ర పురోగమనానికి దిశానిర్దేశం చేస్తాయని భావించిన ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామం, మండలం, జిల్లా, నగరంలోని ప్రతి పౌరుడి స్వరం ప్రతిస్పందనలు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రభుత్వం సిటిజన్ సర్వేకు శ్రీకారం చుట్టినట్టు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ నిర్మాణ ప్రయత్నంలో ప్రతి పౌరుడు సిటిజన్ సర్వేలో పాల్గొనాలను వారు విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యంతో బృహత్తరమైన భవిష్యత్ ప్రణాళిక రూపకల్పనకు ఇది తొలి అడుగని పేర్కొన్నారు. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలని ప్రజల ఆలోచన విధానాలు తెలియజేయడానికి ఇదొక మంచి అవకాశమని అన్నారు. ఇందులో యువకులు, రైతులు, మహిళలు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు, విద్యా వేత్తలు, వయోధికులు.. ప్రతి ఒక్కరూ తమ ఆకాంక్షలను వ్యక్తి చేయాలని కోరారు. మీ ఆలోచనలు, మీ సూచనలు రేపటి తెలంగాణ ప్రాధాన్యాలను నిర్ణయించడంలో కీలకంగా మారుతాయి.

Latest