Mahaa Daily Exclusive

  దౌర్భాగ్య స్థితిలో ఎంజీఎం ఆస్పత్రి

Share

  • దౌర్భాగ్య స్థితిలో ఎంజీఎం ఆస్పత్రి
  • ఇద్దరి పిల్లలకు ఒక్కటే ఆక్సిజన్ సిలిండర్ తో వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు
  • ఎంజీఎం ప్రతిష్టను దిగజారుస్తున్న ఎంజీఎం అధికారులు

వరంగల్ మహా

ప్రభుత్వాలు మారిన, ప్రజా ప్రతినిధులు మారిన ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కైనా పేదల పెద్ద ఆసుపత్రి వరంగల్ ఎంజీఎం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని ఎంజీఎంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే తెలుస్తోంది. ఎంజీఎంను ప్రక్షాళన చేస్తామని అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల సందర్శన, ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ పర్యవేక్షించినప్పటికీ ఎంజీఎం అధికారుల తీరు, సిబ్బందిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే గ్యాస్ పైపుకు రెండు పొయ్యిలు ఉండవచ్చు కానీ ఒకే ఆక్సిజన్ సిలిండర్ ద్వారా అత్యవసర చికిత్సలో ఉన్న ఇద్దరి పసిపిల్లలకు ఆక్సిజన్ అందించడం ఎంజీఎం వైద్య అధికారులకే వైద్యులకే చెల్లుబాటు అవుతుంది. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇదే కోవలో శనివారం ఎంజీఎం లో ఓ సంఘటన చోటు చేసుకుంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సర్వసాధారణంగా సరిపడా ఆక్సిజన్ లేదా? పొదుపు పాటిస్తున్నారా? అనేలా వైద్యుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఇద్దరు పసిపిల్లలకు ఒక్క ఆక్సిజన్ సిలిండర్ నుంచే ఆక్సిజన్ అందిస్తుండడం ఆస్పత్రి వర్గాల పై ప్రజల నుండి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం ఒక్క సిలిండర్తో ఇద్దరు పసిపిల్లలను ఆస్పత్రి ఆవరణలోకి తీసుకురావడం అందరినీ కలిచివేసింది. వైద్యుల తీరుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేషంట్ కేర్, దయమ్మ వారు పేషెంట్లను తరలించాల్సి ఉండగా వారు అందుబాటులో లేకపోవడంతో పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంవల్ల తల్లిదండ్రులే ఆ పిల్లలను ఓ చేత్తో ఎత్తుకొని మరో చేతితో గ్యాస్ సిలిండర్ ను తల్లిదండ్రులే తీసుకొని వైద్య పరీక్షలకు తీసుకువెళ్లడంపై ఆస్పత్రి నిర్వహణ ఎంత దయనీయ స్థితికి దిగజారిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రి సేవలు రోజురోజుకు అధ్వానంగా మారుతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనంగా నిలుస్తుంది. ఆస్పత్రిలో సేవలను పర్యవేక్షించేందుకు ఇద్దరు ఆర్ఎంవోలు, పదుల సంఖ్యలో డాక్టర్ల తో పాటు జూనియర్ డాక్టర్లు, వందల సంఖ్యలో నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నా రోగుల తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడుతుండడం అందరి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. జిల్లా కలెక్టర్ పలుమార్లు గంటల కొద్దీ ఆస్పత్రిని సందర్శించినా, వైద్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసినా ఆస్పత్రి నిర్వహణలో మార్పు రావడం లేదు.. వైద్యులు, సిబ్బందిలో అలసత్వం వీడడం లేదు. ఇంకా ఈ ఆస్పత్రిని అధికారులు, సిబ్బంది కలిసి ఏ దుస్థితికి దిగజారుస్తారో తెలియడం లేదని ప్రజాసంఘాలు మండి పడుతున్నాయి. ఈ ఇటీవల ఎంజీఎంలో చోటు చేసుకున్న సంఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి ఎంజీఎం అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంజీఎం లో కొన్ని ఏళ్లుగా పాతుకుపోయిన అధికారులు సిబ్బందిపై సమగ్ర నివేదిక కోరినట్లు సమాచారం

Latest