మెదక్, మహా
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా నిర్వహించబోయే మేరా యువభారత్ మెదక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. శనివారం మెదక్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా నిర్వహించబోయే మేరా యువభారత్- మెదక్ ను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం దేశ సమైక్యత, సేవా భావం పెంపొందించడంతోపాటు యువతి,యువకుల్లో వృత్తి నైపుణ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 530 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి ఒక పటిష్టమైన భారతదేశంగా ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలకు మార్గదర్శకులు అయ్యారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో యువతి,యువకులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంలోని అన్ని కళాశాలలో ఉపన్యాస, వ్యాస రచర , రంగోలి లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కళాశాలలోని ఎన్ఎస్ఎస్ , ఎన్ సి సి, ప్రభుత్వ శాఖలైన పోలీస్, విద్య వైద్య ,ఇతర శాఖలను భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ఏక్ భారత్ ,శ్రేష్ఠ భారత్ గా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ప్రతి వ్యక్తికి దేశమే ముందు ఏదైనా ఆ తర్వాతే అని పేర్కొన్నారు. అనంతరం మేర యువభారత్ మెదక్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా మేర యువభారత్ అధికారి రంజిత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు








