- హ్యాట్సాప్ పోలీస్..
- డీసీపీ చైతన్యకుమార్ ధైర్య సాహసాలను అభినందిస్తున్నా
- రౌడీ షీటర్లు, దొంగల పట్ల ఉక్కుపాదం మోపుతాం: డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, మహా: హైదరాబాద్ నడిబొడ్డున తుపాకీ కాల్పుల ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. శనివారం చాదర్‌ఘాట్‌లో పోలీసులపై మొబైల్ స్నాచర్లు కత్తితో దాడికి యత్నం చేశారని తెలిపారు. సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడే వారిని పట్టుకునే క్రమంలో నిందితులు కత్తితో దాడి చేశారని.. డీసీపీ చైతన్య కుమార్, గన్ మెన్ మూర్తి 750 మీటర్లు వెంబడించి నిందితులను చేజ్ చేశారని తెలిపారు. అందులో భాగంగా నిందితులు కత్తితో దాడి చేశారని చెప్పారు. నిందితుడు సయ్యద్ ఒమర్ అన్సారీపై 22 కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు. కలపథర్ పరిధిలో ఒమర్ అన్సారీపై రౌడీ షీట్ ఉందని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ధైర్యసాహసాలు కనబరిచిన డీసీపీ, గన్‌మెన్ ఆర్యోగ్య పరిస్థితిని తాను తెలుసుకున్నట్లు తెలిపారు.
నేడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం..
ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఇద్దరు అధికారులు నేడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నిందితుడు ఒమర్ అన్సారీ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగిందని.. ఇతని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పారు. డీసీపీ సౌత్ జోన్ నేతృత్వంలో ఈ కేసుతో సంబంధం ఉన్న ఆటో డ్రైవర్, మరొక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీస్ బృందాలు పని చేస్తున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కొన్ని ఆధారాలు కూడా లభించాయన్నారు. ఇటీవల ఒమర్ కదలికలు, అతనికి ఉన్న పరిచాయలపై ఆరా తిస్తున్నామని.. విజబుల్ పోలీసింగ్ కూడా పెంచామని వివరించారు. నగర ప్రజలెవ్వరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. పోలీసులు ఎప్పుడూ రక్షణగా ఉంటారని ధైర్యం చెప్పారు. రౌడీ షీటర్ లు, దొంగల పట్ల ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు








