Mahaa Daily Exclusive

  హ‌రీష్ రావు ..ఎవ‌రి చెంప చెల్లు మంట‌దో, ఎవ‌రి గూబ గుయ్ మంట‌దో 11 తేదీన తెలుస్తుంది:చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి,

Share

 

హ‌రీష్ రావు ..ఎవ‌రి చెంప చెల్లు మంట‌దో, ఎవ‌రి గూబ గుయ్ మంట‌దో 11 తేదీన తెలుస్తుంది..

మా మామ హైద‌రాబాద్ లో ల‌క్ష ఇండ్లు క‌ట్టించాడు..రేవంత్ రెడ్డి ల‌క్ష ఇండ్లు కూల్చిండు అని హ‌రీష్ రావు అంటున్నాడు..

కేసీఆర్ ల‌క్ష ఇండ్లు ఎక్క‌డ క‌ట్టాడో చూపించాలి.. ఆ ల‌క్ష మంది రోడ్డు పైకి వ‌చ్చి చెప్పాలి..

వ‌ర్షాకాలంలో హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఎంత ఇబ్బందిప‌డ్డారో అంద‌రూ చూశారు..

హైద‌రాబాద్ ను న్యూయార్క్ చేస్తా, విశ్వ‌న‌గ‌రం చేస్తాన‌ని చెప్పి మునిగిపోయే న‌గ‌రంగా మార్చారు..

న‌గ‌రం వ‌ర‌ద‌లో మునిగిపోతుంటే చెరువు లో క‌ట్టిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేసింది, నాలాల‌పైన ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించారు..

హైద‌రాబాద్ లో నిబంధన‌ల‌కు విరుద్దంగా చెరువుల ప‌క్క‌న ఇళ్లు క‌డితే కొన‌డానికి ఎవ‌రూ సిద్ధంగా లేరు..దీనికి కార‌ణం సీఎం రేవంత్ రెడ్డి.

 

ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయ‌ని హ‌రీష్ రావు వేదిక‌ల‌పైన‌ ప‌నికిరాని మాట‌లు మాట్లాడుతున్నాడు..

హుజూరాబాద్ లో డ‌బ్బులు పంచి గెలిచిన‌ట్లు జూబ్లీహిల్స్ లో కూడా గెల‌వాల‌ని ప్ర‌య‌త్నం చేశారు..

న‌వీన్ యాదవ్ కు నామినేష‌న్ తోనే కాంగ్రెస్ విజ‌యం ఖాయ‌మ‌ని తేలిపోవ‌డంతో కేటీఆర్, హ‌రీష్ రావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు…

బీఆర్ఎస్ పార్టీ డెవ‌ల‌ప్మెంట్ మీద కాకుండా సెంటిమెంట్ మీద ఓట్లు తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది..

న‌వీన్ యాద‌వ్, కాంగ్రెస్ ప్ర‌చారం అంతుచిక్క‌క బీఆర్ఎస్ నాయ‌కులు గంద‌రగోళంలో ఉన్నారు..

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడారు….పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో గుండా సున్నా వ‌చ్చింది.. కంటోన్మెంట్ ఉప ఎన్నిక చిత్త‌య్యారు..

బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుంద‌న్న భ‌యంలో ఉన్నారు..

మీ పార్టీ జెండా క‌ట్టే వాళ్లు కూడా ఉండ‌ర‌నే నువ్వు, నీ బామ్మ‌ర్థి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు.

Latest