Mahaa Daily Exclusive

  ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం ఖాయం..

Share

  • ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం ఖాయం
  • బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం ధీమా
  • ఆస్ట్రేలియా నుంచి ప్రచారానికి పలువురు.. కేటీఆర్ అభినందన

హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా నుండి వచ్చిన.. బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ప్రతినిధి బృందాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభినందించారు. తెలంగాణ ఉద్యమం నాటి నుండి ప్రతి ఎన్నికలోనూ ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా వచ్చి ప్రచారంలో పాల్గొంటూ పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తున్నామని బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ముఖ్య నాయకులు సాయిరామ్‌ ఉప్పు, వినయ్‌ సన్నీ గౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ వారిని శాలువాతో సత్కరించారు. ఈ ఉపఎన్నిక తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాలని, కాంగ్రెస్‌ అవినీతి పాలనకు చెంపపెట్టు కొట్టే విధంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఘనవిజయం సాధించాలనే ధీమావ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయంతో తెలంగాణ ప్రజల గౌరవం మరింతగా పెరుగుతుందని వినయ్‌, సన్నీ గౌడ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌ పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా బృందాన్ని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అభినందించారు

Latest