Mahaa Daily Exclusive

  సంక్షేమం.. ప్రగతిమంత్రం … ఇదే సీఎం రేవంత్ రెండేళ్ళ పాలనా తీరు…..

Share

(హైదరాబాద్ -మహా)

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రెండేళ్ళలో తన మార్క్ ప్రదర్శించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిన రంగాలపై ప్రత్యేకఫోకస్ పెట్టారు. విద్, ఉపాధి వంటి రంగాలను పట్టించుకున్నారు. అలసత్వంపై కొరడా పట్టుకున్నారు. హైడ్రాతో అక్రమార్కుల వెన్నులో వణుకుపుట్టించారు. ఈగల్ తో భయం కలిగించారు. గద్దర్ సినిమా అవార్్డులతో కోల్పోయిన సంప్రదాయాలను తెలంగాణ రాష్ట్రంలో తిరిగి తీసుకొచ్చారు. తెలంగాణ గీతాన్ని ఆమోదించారు. తెలంగాణ తల్లికి కొత్త రూపమిచ్చారు. ఉచిత బస్సు ప్రయాణంతో ట్రెండ్ సెట్టర్ అయ్యారు.

ఇవీ హైలెట్స్

– 70వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి దేశంలో ఏ రాష్ట్రం ఏడాదిన్నర కాలంలో చేయని సాహసం చేశారు.

– ఉచిత బస్సుప్రయాణం విజయవంతంగా అమలుచేశారు.

– ఫ్రీకరెంట్ 200యూనిట్ల వరకు అమలుచేస్తూ పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చారు.

– 500రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుచేస్తున్నారు

– సన్నబియ్యానికి రూ.500బోనస్ ఇస్తున్నారు.

– 9లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులిచ్చారు.

– సన్నబియ్యం పథకంతో సరికొత్త చరిత్ర సృష్టించారు.

– దాదాపు 2లక్షల కోట్ల ఐటీ పెట్టుబడులు సాధించారు

– వరంగల్, ఆదిలాబాద్ నూతన ఎయిర్ పోర్టులు సాధించారు.

– రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పథకం ప్రారంభించారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.200కోట్లు కేటాయిస్తున్నారు.

– రైతు రుణమాఫీ రూ.20వేల కోట్లకు పైగా చేసి రికార్డు నెలకొల్పారు. రైతుభరోసా ఎకరాకు రూ.12వేలు అమలుచేస్తున్నారు.

ఎన్నో ప్రణాళికలు

మూసీ పునరుజ్జీవ పథకంపై ఎంతో వర్క్ చేశారు. త్వరలోనే ఇది పట్టాలెక్కనుంది. ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టారు. ట్రిపుల్ ఆర్ ను కొలిక్కి తెచ్చారు. హైదరాబాద్- అమరావతి మధ్య రోడ్ల సౌకర్యం పెంపొందిస్తున్నారు. హైదరాబాద్ – విజయవాడ హైవే ఆరులైన్లు కానుంది

Latest