Mahaa Daily Exclusive

  తమిళనాడులో కొత్త సర్కార్… బీజేపీ స్టేట్ చీఫ్ నాగేంద్రన్‌ కీలక వ్యాఖ్య..

Share

తమిళనాడు, మహా: తమిళనాడు ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది మే 10తో ముగియనున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకముందే.. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏప్రిల్‌ 10న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని ఓ కార్యక్రమంలో చెప్పడం గమనార్హం. ధర్మపురిలో నిర్వహించిన ఓ సభలో ఆయనతో పాటు అన్నాడీఎంకే మాజీ మంత్రి కేపీ అన్బళగన్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నయినార్‌ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఎడప్పాడి పళనిసామి ఎన్డీయే అభ్యర్థి. ఇది బలమైన కూటమిగా నిలుస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో పళనిసామి చేతులు కలిపితేనే డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం పనిచేస్తుంది. కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు

Latest