Mahaa Daily Exclusive

  సీఐడీ సిట్‌ విచారణకు విజయ్ దేవరకొండ….

Share

  • సీఐడీ సిట్‌ విచారణకు విజయ్ దేవరకొండ
  • బెట్టింగ్ యాప్స్ కేసులో గంటసేపు విచారణ

హైదరాబాద్, మహా
బెట్టింగ్ యాప్స్‌ కేసులో నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ(క్రైమ్​ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్​మెంట్) సిట్‌ విచారణ పూర్తి అయ్యింది. హైదరాబాద్​లోని సీఐడీ కార్యాలయంలో సుమారు గంటకు పైగా పోలీసుల విచారణ కొనసాగింది. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్‌ దేవరకొండను సిట్‌ అధికారులు ప్రశ్నించారు. ప్రమోట్​ చేసినందుకు పారితోషికం, కమీషన్లు తదితరాలపై ఆరా తీసినట్లు సమాచారం. దర్యాప్తు అధికారులు సుమారు గంటపాటు విజయ్​ను ప్రశ్నించారు. ఇకపై బెట్టింగ్, గేమింగ్ యాప్​లకు ప్రమోషన్స్ చేయబోనని సిట్ ఎదుట విజయ్ దేవరకొండ చెప్పినట్లు సమాచారం. విచారణ అనంతరం సీఐడీ కార్యాలయం వెనుక గేటు నుంచి ఆయన వెళ్లిపోయారు. బెట్టింగ్ యాప్​ కేసులో విచారణకు హాజరు కావాలని విజయ్‌ దేవరకొండతో పాటు నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కూడా సీఐడీ సిట్‌ గతంలోనే నోటీసులు జారీ చేసింది.

Latest