Mahaa Daily Exclusive

  కేకే ఎక్కడ? సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్…

Share

  • కేకే ఎక్కడ?
  • సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్
  • బెట్టింగ్ లతో ఆగమాగం

హైదరాబాద్, మహా
కేకే సర్వేపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రీపోల్ సర్వేలో ఒక్కో డివిజన్ లో 30శాతానికి పైగా లీడ్ ను గ్రౌండ్ తో సంబంధం లేకుండా స్క్రీన్ లపై చూపించిన కేకే బీఆర్ఎస్ నేతలను ఆనందపరిచారు. దీని ద్వారా ఏపీలో బెట్టింగ్ లు భారీగా జరిగాయి. కేకే సర్వే చూసి చాలా మంది బీఆర్ఎస్ నేతలే షాక్ కు గురయ్యారు. 17శాతానికి పైగా మెజారిటీతో బిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. అంతటితో ఆగకుండా ఎగ్జిట్ పోల్స్ కూడా అదేరకంగా చెప్పారు. తెలంగాణలోని మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ గెలుపును సూచించగా, కేకే మాత్రమే బీఆర్ఎస్ గెలుపును సూచించారు. మాకు కేకే ఉన్నాడు.. ఎగ్జాక్ట్ సర్వే అంటూ బీఆర్ఎస్ నేతలు కూడా భారీగా బెట్టింగ్ లు కట్టి అడ్డంగా మునిగిపోయారు. శ్రేయాస్ మీడియాతో కలిసి 70 కోట్ల డీల్ అని కొందరు, కేకే నువ్వు తెలంగాణలో కనపడు ఉరికిస్తాం అని మరికొందరు నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతూ ఫైర్ అవుతున్నారు. ఒక్క ఏపీ ఫలితం తప్ప అన్ని సర్వేల్లోనూ పల్టీ కొడుతున్నా కేకేను భుజాలకెత్తుకుని తాము నష్టపోయామని పలువురు బిఆర్ఎస్ నేతలు అన్నారు.

Latest