Mahaa Daily Exclusive

  రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు జరిపితే ఊర్కునేదిలేదు

Share

  • కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలి
  • బీసీ సమాజ్ రాష్ట్ర నాయకులు నరెడ్ల శ్రీనివాస్

మంచిర్యాల, మహా : 42 శాతం రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు జరిపితే ఊర్కునేదిలేదని బీసీ సమాజ్ రాష్ట్ర నాయకులు నరెడ్ల శ్రీనివాస్, ఎండి అబ్బాస్, బర్ల సదానందం, నస్పూరి తిరుపతి లు హెచ్చరించారు. గురువారం మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ బీసీలకు న్యాయం గా రావాల్సిన హక్కుల గురించి ప్రతి ఒక్కరూ పోరుబాట నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంట్ లో ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేయాలని వారు కోరారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 130 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారని వారు తెలిపారు. అలాగే ఏ ఉద్యమం లేకుండానే అగ్రకులాలకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 103ను ఐదు రోజుల్లో సవరణ చేసి 10 శాతం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు కల్పించిందని వారు వివరించారు. గత 40 సంవత్సరాలుగా బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షులు చిలగాని సుదర్శన్, ‌ఒజ్జా సాగర్ బాబు, దూడపాక రాజేందర్, శనిగారపు జనార్ధన్, బిసి సమాజ్ నాయకులు వెన్నంపల్లి రవీందర్, అంకం సాగర్, శీలం మహేందర్, డాక్టర్ పోషం,కంది తిరుపతి పిల్లి మల్లేష్, బర్ల శేఖర్ తదితర కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Latest