స్పీకర్‌ను కలిసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్
నవీన్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ ప్రసాద్
హైదరాబాద్, మహా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో ఈ భేటీ జరిగింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా స్పీకర్‌ను కలిసిన నవీన్ యాదవ్, ఈ సందర్భంగా తమ నియోజకవర్గ ప్రజల తరపున, వ్యక్తిగతంగా స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర శాసనసభ నిర్వహణలో స్పీకర్ పాత్రను అభినందించారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. యువ ఎమ్మెల్యేగా ప్రజలకు మరింత చేరువై పని చేయాలని ఆకాంక్షించారు.
Post Views: 28








