- పదోసారి సీఎం పీఠంపై నితీశ్
- 17 ఏళ్లుగా పీఠంలో కొనసాగుతున్న రికార్డు
- పాట్నాలో అట్టహాసంగా ప్రమాణస్వీకార కార్యక్రమం
- నితీశ్‌తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం
- సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు
- కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు
బిహార్, మహా: జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. నితీశ్ కుమార్‌తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
ఎన్డీయే కూటమి డబుల్ సెంచరీ..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అదరగొట్టింది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే ఏకంగా 202 సీట్లు దక్కించుకుంది. బీజేపీ 101 సీట్లలో పోటీ చేసి 89 చోట్ల గెలుపొందింది. 101 సీట్లలోనే పోటీ చేసిన జేడీయూ 85 చోట్ల విజయం సాధించింది. తాజాగా ప్రమాణస్వీకారం చేసిన 27 మంత్రుల్లో.. 14 మంది బీజేపీ నుంచి కాగా, 9 మంది జేడేయూకు చెందిన నేతలు. బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్ దాదాపు 19 ఏళ్లు పదవిలో ఉన్నారు. 2000 సంవత్సరంలో ఏడు రోజులు మాత్రమే సీఎంగా పని చేశారు. ఇప్పుడు ఎన్డీయే కూటమి మళ్లీ ఆయనకే పగ్గాలు అప్పగించడంతో పదోసారి సీఎంగా ప్రమాణం చేశారు.
దాదాపు 19 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా..
నితీశ్ కుమార్ దాదాపు 19 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. 2000 సంవత్సరంలో తొలిసారి సీఎంగా ఏడు రోజులు మాత్రమే పనిచేసిన ఆయన, ఇప్పుడు పదోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా నితీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “రాజకీయాల్లో ఎంతో అనుభవం, రాష్ట్రానికి మంచి పాలన అందించిన అద్భుతమైన రికార్డు నితీశ్‌కు ఉంది” అని ఆయన కొనియాడారు.
====================






