- సమంత వెడ్స్ రాజ్
- ఒక్కటైన స్టార్ హీరోయిన్, డైరెక్టర్
- భూతశుద్ధి వివాహం అనే ప్రత్యేక యోగ సంప్రదాయంలో పెళ్లి
సినిమా, మహా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడమోరును పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో సోమవారం సంప్రదాయబద్ధం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కొద్ది మంది కుటుంబీకులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను సమంతా స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం వీరి పెళ్లి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సమంత-రాజ్‌ల వివాహంపై ఈశా ఫౌండేషన్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. సమంత-రాజ్ ‘భూతశుద్ధి వివాహం’ అనే ప్రత్యేక యోగ సంప్రదాయం విధానంలోకి జరిగిందని పేర్కొంది. దాంతో చాలా మంది ‘భూత శుద్ధి వివాహం’ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Post Views: 24







